వ్యాపారంలో వాట ా ఇస్తానని నమ్మబలికి 15 కోట్ల మేర మోసం చేసిన ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. టొబాకో, వైన్‌షాపులు నిర్వహిస్తున్న నిమ్మల కిష్టప్ప పలువురి దగ్గర నుంచి నగదు తీసుకున్నాడు. ఏళ్లు గడుస్తున్నా చెల్లించకుండా వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పాడు. మరోవైపు గుమాస్తాల పేరు మీద వైన్‌షాపు లైసెన్స్‌లు తీసుకోవడమే కాకుండా.. బ్యాంకు రుణాలు సైతం తీసుకున్నాడు. తమ డబ్బులు ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోతున్నారు. మరైవైపు తమ పేర్ల మీద తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 23 మంది భాదితులు గుంటూరు గ్రామీణ ఎస్పీని ఆశ్రయించారు.
ఇదీ చూడండి