ప్రకాశం జిల్లాలో తెదేపా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు.. బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఐదుగురు వ్యక్తుల నుంచి దాదాపు 89, 900 రూపాయల నగదు, ఒక చరవాణి దొంగిలించారు. మరో వ్యక్తి జేబును కత్తిరించడానికి ప్రయత్నించగా దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారణ జరిపి బాధితులకు నగదును తిరిగి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: