రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా ఘనంగా జరుగుతున్నాయి. 71వ ఏటలోకి అడుగుపెడుతున్న చంద్రబాబుకు... పార్టీ నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. అహర్నిశలూ ప్రజాసేవలో కొనసాగుతున్న చంద్రబాబు సంకల్పబలం అనితర సాధ్యమని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. కలకాలం సంతోషం, ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతున్ని కోరారు.
లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లోని తన నివాసంలోనే చంద్రబాబు జన్మదిన వేడుకలు జరపుకోనున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తెలుగుదేశం నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.
ఇవీ చదవండి: భారత్లో 17వేల మందికి వైరస్- 'మహా'లో అధికం