Chandrababu and Lokesh on Farmer Suicide in Guntur District: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో యువరైతు బసవపున్నయ్య ఆత్మహత్యపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గం నగరం సభలో బసవపున్నయ్య ఆతహత్యకు దారితీసిన పరిస్థితులను చంద్రబాబు వివరించారు.
ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వక పోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పట్టిసీమ నీళ్లు ఇచ్చి ఉంటే ముందే పంట చేతికి వచ్చేదన్నారు. రైతులు తుపాన్లు బారిన పడకుండా ఉండడానికే పట్టిసీమ తెచ్చామని పేర్కొన్నారు. ముందు నీళ్లు వచ్చి ఉంటే ఈ పాటికే బసవపున్నయ్య పంట కోత పూర్తి అయ్యేదన్నారు. బసవపున్నయ్య ఆత్మహత్యపై ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని చంద్రబాబు ప్రశ్నించారు.
-
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య, తుఫానులో పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది.#CBNwithCycloneVictims #CycloneMichaung#NCBN pic.twitter.com/R4yjGaGMP9
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య, తుఫానులో పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది.#CBNwithCycloneVictims #CycloneMichaung#NCBN pic.twitter.com/R4yjGaGMP9
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య, తుఫానులో పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడటం తీవ్రంగా కలచివేసింది.#CBNwithCycloneVictims #CycloneMichaung#NCBN pic.twitter.com/R4yjGaGMP9
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023
నిలువునా ముంచేసిన మిగ్జాం తుపాను - పురుగు మందు తాగి యువ రైతు ఆత్మహత్య
Nara Lokesh Fires on YSRCP Govt: వ్యవసాయం పట్ల వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరితో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వరి వేసిన తులిమెల్లి బసవ పున్నయ్య పంట నష్టపోయి తీవ్రమనస్తాపంతో ఆత్మహత్యకి పాల్పడటం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వారి కుటుంబసభ్యులకి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
బసవపున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. మొన్నటి వరకూ కరవుతో ఎండిన పంటలు అప్పులు చేసి కాపాడితే, తుపాను వచ్చి మొత్తం ఊడ్చేసిందని అన్నారు. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అన్నదాతలారా అధైర్యపడొద్దు, మూడు నెలలు ఓపిక పట్టండి రైతు బంధువైన టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది మీ కష్టాలు తీరుస్తుందని స్పష్టం చేశారు.
జగన్కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు
Young Farmer Suicide in Duggirala Guntur District: గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన యువరైతు తుల్లిమిల్లి బసవపున్నయ్య 7 ఎకరాలలో వరి పంట వేశారు. ఇందులో 5 ఎకరాలు కౌలుకు తీసుకోగా, మరో రెండు ఎకరాలు సొంత పొలం. అప్పు తెచ్చి మరీ పంటకు పెట్టుబడి పెట్టారు. ఈ సంవత్సరం కృష్ణా డెల్టా ప్రాంతంలో నీటి లభ్యత అనుకున్న స్థాయిలో లేకున్నా మోటార్ల సాయంతో పంటను ఏదో ఒక విధంగా బతికించుకున్నారు.
మరో వారం రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న సమయంలో వచ్చిన మిగ్జాం తుపాను ఆ యువరైతు ప్రాణాలను బలి తీసుకుంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నీటమునిగింది. దీంతో అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టిన బసవపున్నయ్య తట్టుకోలేకపోయారు. పంట మొత్తం వర్షార్పణం కావడంతో ఈ నెల 7న పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బసవపున్నయ్య శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.
'తుపానుపై అప్రమత్తం చేయడంలో, సహాయకచర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం'