ETV Bharat / state

సీఎస్ నీలం సాహ్నికి చంద్రబాబు లేఖ - సీఎస్​కు చంద్రబాబు లేఖ

కరోనా కారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్​ నీలం సాహ్నికి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రానికి వచ్చేందుకు ఎలాంటి విమాన సౌకర్యం లేనందునే వారు రాలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

chandra babu
chandra babu
author img

By

Published : May 6, 2020, 9:03 PM IST

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలంటూ... ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అనేక వర్గాల వారు దూర తీరాల్లో చిక్కుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వారందర్నీ స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

దిల్లీ నుంచి దక్షిణాది రాష్ట్రాలు, గల్ఫ్‌ నుంచి ఆఫ్రికా వరకూ చిక్కుకుపోయిన తెలుగు వారు వెనక్కి రాలేక అనేక అవస్థలు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు ఎలాంటి విమాన సౌకర్యం లేనందునే వారు రాలేకపోతున్నారన్నారు. గతంలో ఉత్తరాఖండ్‌లో తెలుగువారు చిక్కుకుంటే తెదేపా తరఫున ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇదీ చదవండి

ప్రతీ వలస కూలీకి దారి ఖర్చుకు రూ.500 సాయం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.