ETV Bharat / state

సీఎస్​గా నీలం సాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగింపు - cs neelam sahani latest news

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సీస్ పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖకు కేంద్రం స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.

Center green
Center green
author img

By

Published : Jun 3, 2020, 4:30 PM IST

Center green
సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం 3 నెలలు పొడిగించిన కేంద్రం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. ఈ నెలాఖరుతో సీఎస్ పదవీ కాలం పూర్తవుతున్న తరుణంలో.. మరో 6 నెలలు పాటు ఆమెను సీఎస్ గా కొనసాగించాలంటూ సీఎం జగన్.. కేంద్రానికి లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నీలం సాహ్ని.. 2019 నవంబరు 13న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1984 బ్యాచ్‌కు చెందిన ఆమె ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శుల పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆనాటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి ఏపీలో సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని 3 నెలలు పొడిగించింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పీకే మహంతి పదవీకాలాన్ని 4 నెలల పాటు పొడిగించింది.

ఇప్పుడు.. నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి ఆ విషయాన్ని విన్నవించింది. అయితే... సీఎం జగన్ కోరినట్టు 6 నెలలు కాకుండా 3 నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించింది.

ఇదీ చదవండి:

సరిహద్దు రగడపై కీలక భేటీకి భారత్​-చైనా రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.