ఇదీ చదవండి:'విజయవాడ - హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం రాయితీ'
ప్రైవేట్ దందాపై ఉక్కుపాదం... 3వేలకుపైగా కేసులు
ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రైవేట్ ట్రావెల్స్‌ను రాష్ట్ర మంత్రి పేర్నినాని హెచ్చరించారు. టికెట్ ధరలు పెంచిన బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 20 వరకు తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
'cases filed on Over 3000 private buses in ap' minister perni nani said
ప్రైవేట్ బస్సుల దోపిడీ కట్టడికి చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్నినాని వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా టికెట్ ధరలు పెంచిన బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. జనవరి 2 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ బస్సులపై 3,132 కేసులు నమోదు చేశామని చెప్పారు. 546 బస్సులు సీజ్ చేశామని వివరించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులకు అదనంగా ప్రత్యేక బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కొన్ని రూట్లలో అధిక ధరలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఈనెల 20 వరకు రవాణాశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఫిర్యాదులు ఇవ్వొచ్చని మంత్రి పేర్ని నాని సూచించారు.
ఇదీ చదవండి:'విజయవాడ - హైదరాబాద్ ఆర్టీసీ బస్సుల్లో 40 శాతం రాయితీ'