కృష్ణా జిల్లా మచిలీపట్నం ఏఆర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కోట చంద్రశేఖర్ కుటుంబం.. బంధువు కర్మకాండకు వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. చంద్రశేఖర్, ప్రియ దంపతులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. ఆయన అత్త భాగ్యలక్ష్మి చనిపోయారు. మరో వ్యక్తి రామారావు.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇటీవల చంద్రశేఖర్ బంధువు కరోనాతో చనిపోయారు. అప్పుడు చివరి చూపునకు వెళ్లలేకపోయామన్న ఆవేదనతో.. కనీసం కర్మకాండకైనా హాజరు కావాలని అనుకున్నారు. భార్య ప్రియ, అత్త భాగ్యలక్ష్మిని తీసుకుని సొంతూరైన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రుకు వెళ్లారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత.. బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేట - నరసరావుపేట మార్గంలో గంగన్నపాలెం వద్ద.. ఇర్లపాడు మలుపులో కారు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.
తీవ్రంగా గాయపడిన ముగ్గురిని.. స్థానికులు నరసరావుపేటలోని ఆస్పత్రిలో చేర్పించారు. వారితో పాటు ఉన్న కనపర్రు వాసి కారసాల రామారావు.. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చికిత్స పొందుతూ.. చంద్రశేఖర్ అత్త భాగ్యలక్ష్మి (55) చనిపోయారు.
ఇదీ చదవండి: