గుంటూరు జిల్లాలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కాకుమాను నుంచి బాపట్లకు వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు అప్పాపురం సమీపంలో అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. రహదారిపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బస్సు కమాన్‌కట్ట విరగడంతో కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. క్షతగాత్రులను బాపట్ల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: Bus accident: ఘోర ప్రమాదం..వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. 9 మంది మృతి