ఇసుక క్వారీలను తెరిచి... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు ప్రసాదరావు మాట్లాడుతూ... 5 నెలలుగా ఇసుక క్వారీలు మూసివేయడంతో... కార్మికులు పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కనీసం నిత్యావసరాలు తీర్చుకునే స్థితిలోనూ లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే క్వారీలను తెరిచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ముందు వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
ఇదీ చదవండీ.. సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?