రాష్ట్రంలోని పురాతన స్టేడియం గుంటూరు జిల్లాలోని బ్రహ్మానంద రెడ్డి స్టేడియం. ఈ క్రీడా మైదానాన్ని 1965లో 26.40 ఎకరాల్లో నిర్మించారు. 1989లో నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. 1980, 90 లలో ఫస్ట్ క్లాస్ రంజీ మ్యాచ్‌లు జరిగాయి. జిల్లాకే తలామనికంగా నిలిచిన ఈ మైదానం గురించి తెలియని వాళ్లు అంటూ ఉండరు. అయితే కొన్ని ఏళ్లుగా బి.ఆర్ స్టేడియం తన ఉనికిని కోల్పోయింది. చెత్తకుప్పలకు, బురద నీటికి, పిచ్చి మొక్కలకి నిలయంగా మారింది.
ఒక్కప్పుడు పిల్లలు, క్రీడాకారులతో సందడిగా ఉన్న ఈ మైదానం.. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జలమయం అయింది. గుంటూరులో కొద్దిపాటి వర్షం కురిసినా.... ముందుగా నీట మునిగేది ఈ మైదానమే. స్థానికులు, క్రీడాకారులు ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు సమస్యను వివరించినా బీఆర్ క్రీడా మైదానం అభివృద్ధి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా మైదానానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: