గుంటూరులో కురిసిన భారీ వర్షానికి బ్రహ్మానందరెడ్డి స్టేడియంలోకి వర్షం నీరు చేరింది. కరోనా కారణంగా ప్రస్తుతం స్టేడియంలో ఎలాంటి క్రీడా కార్యక్రమాలకు అనుమతి లేదు. పూల వ్యాపారులకు ఈ స్టేడియం కేటాయించారు. అయితే వర్షపు నీరు నిలిచిన కారణంగా వారి వ్యాపారాలకు ఆటంకం ఏర్పడింది. స్టేడియంలోనికి వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని వ్యాపారులు కోరుతున్నారు.
గతంలోనూ ఇలా వర్షపు నీరు రావటంతో అవి పోయేంత వరకూ క్రీడాకారులు ఆటలు ఆడే పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. స్టేడియం మొత్తం నీరు నిలవటంతో చూసేందుకు చెరువుని తలపించింది. స్టేడియం పక్కనే ఉన్న చెరువుని మూసివేయటమూ దీనికి ఓ కారణం.


ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు