గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 23 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారు. ఆరు 2016 కు ముందు ఇక్కడ సాధారణ ఉత్తీర్ణత ఉండేది. అదే ఏడాది వచ్చిన రాజేశ్వరరావు అనే ప్రధానోపాధ్యాయుడు బడి వాతావరణమే మార్చేశారు.
కలిసిగట్టుగా శ్రమించారు..
ప్రధానోపాధ్యాయుడు గ్రామస్థులతో మాట్లాడి... పాఠశాల అభివృద్ధికి పునాది వేశారు. మౌలిక సదుపాయాలు కల్పించి... బడి స్వరూపాన్నే మార్చేశారు. సీసీ కెమెరాలు, డిజిటల్ క్లాస్ రూమ్, బెంచీలు, వంట సామగ్రి ఏర్పాటు చేయించారు.
సౌకర్యాలు పెరిగేసరికి విద్యార్థులూ ఉత్సాహంతో చదివారు. ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. గతేడాది 11 మంది అర్హత సాధించారు. చదరంగం, యోగా, కరాటేలోనూ ప్రతిభ చాటుతున్నారు.
మరిన్ని సౌకర్యాల కోసం వినతి...
క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని మౌలిక వసతులు సమకూరిస్తే... ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామంటున్నారు ఇక్కడి విద్యార్థులు.