భాజపా ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భాజపా నిర్వహిస్తున్న దృశ్య, శ్రవణ సమావేశం నేడు ఏపీలో జరగనుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పార్టీ నేతలు, శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారని రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రజలకు చెప్పిన అంకెల గారడీని ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, అఖిలభారత భాజపా కార్యదర్శి సత్య కుమార్, ఏపీ భాజపా వ్యవహారాల ఇన్ఛార్జీ సునీల్‌దేవ్‌ధర్ పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: కల్నల్ సంతోష్ వీర మరణం: ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు