ETV Bharat / state

మంత్రి నానిపై భగ్గుమన్న భాజపా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

మంత్రి కొడాలి నాని హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై.. భాజపా నేతలు భగ్గుమన్నారు. మంత్రిని బర్త​రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు.

bjp leaders agitation
రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసనలు
author img

By

Published : Sep 24, 2020, 6:10 PM IST

  • చిత్తూరు జిల్లాలో..

మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుటు భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్ల వేషధారణతో నేతలు ర్యాలీ నిర్వహించారు. దేవాలయాలను హేళన చేస్తూ, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి మాట్లాడటం బాధాకరమని అన్నారు. మంత్రి కొడాలి నానిని అరెస్టు చేయాలని కోరుతూ.. తహసీల్దార్ జరీనాబేగంకు వినతిపత్రం అందజేశారు.

కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లెలో భాజపా నేతలు నిరసనకు దిగారు. భాజపా నాయకులు మదనపల్లె సబ్​ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టటంతో.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుకు నిరసన భాజపా నాయకులు రోడ్డుపైనే బైఠాయించగా, సీఐ వారిని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో నాయకులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు దాడికి ప్రయత్నించారని నాయకులు ఆరోపించారు.

  • గుంటూరు జిల్లాలో...

హిందూ దేవుళ్లు, ప్రధాని మోదీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా... గుంటూరు కలెక్టరేట్ ఎదుట భాజపా శ్రేణులు ధర్నా చేపట్టాయి. తక్షణమే మంత్రిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. మోదీని విమర్శించే నైతిక హక్కు, అర్హత కొడాలికి లేదంటూ.. భాజపా నేతలు విమర్శించారు. హిందూ సమాజం, దేవాలయాల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడిన అతడిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

  • విశాఖ జిల్లాలో..

హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే.. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని విశాఖ జిల్లాలో భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా... నాయకులు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న కొడాలి నాని.. దేశ ప్రధాని పట్ల అనుచితంగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లపై అనుచితంగా మాట్లాడుతున్న మంత్రిపై సీఎం జగన్ చర్యలు తీసుకోకపోవటం దారుణమని అన్నారు. మంత్రి కొడాలి నానిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో భాజాపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సీఎం జగన్ పాలనలో హిందువులకు, ఆలయాలకు రక్షణ కరవయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • పశ్చిమ గోదావరి జిల్లాలో...

మంత్రి కొడాలి నానిని తక్షణమే బర్తరఫ్ చేసి.. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని భాజపా, జనసేన నేతలు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద ఇరు పార్టీ నేతలు.. మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మంత్రి మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ మాట్లాడకపోవటం ఏంటని నిలదీశారు. మంత్రి కొడాలిపై తగిన చర్యలు తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

  • ప్రకాశం జిల్లాలో..

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రకాశం జిల్లా ఒంగోలులో భాజపా నేతలు ఆందోళనకు దిగారు. భాజపా, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ మతాన్ని కించపరుస్తూ, తిరుమల సంప్రదాయాలను కాలరాసే విధంగా మంత్రి మాట్లాడటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.

  • నెల్లూరు జిల్లాలో..

మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని నెల్లూరు జిల్లా భాజపా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన మంత్రిని తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు.

  • శ్రీకాకుళం జిల్లాలో..

శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలో భాజపా నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్ర మంత్రి వర్గం నుంచి కొడాలి నానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని హిందువుల ద్రోహి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టరేట్​ను ముట్టడించేందుకు ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకోవటంతో.. భాజపా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

  • అనంతపురం జిల్లాలో..

అనంతపురంలోని కలెక్టరేట్ వద్ద భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. మంత్రిపదవిలో ఉండి దేశ ప్రధాని, హిందూ దేవుళ్ల పైన విమర్శలు చేయడం సరికాదని హితువు పలికారు. మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలను మానుకొని.. ఆత్మ పరిశీలన చేసుకోవాని నేతలు సూచించారు. అన్ని మతాల వాళ్లు ఓట్లు వేస్తేనే అధికారంలోకి వచ్చారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.... ఇలాంటివి పునరావృతమైతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'ప్రధాని మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.