అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ భాజపా నేత గుడివాక రామాంజనేయులు.. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ లేనివారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామాంజనేయులు... తెలంగాణ నుంచి రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తున్న కేసులో ఏ-1 నిందితుడిగా పట్టుపడటం తెలిసిందే.
ఇదీచదవండి.