వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార అహకారంతో విర్రవీగుతుందని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కన్నా.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల డబ్బులను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ.. తాము అధికారంలో ఉన్నాం.. తిరిగి మేమే అధికారంలోకి వస్తామని ధీమాగా ముఖ్యమంత్రి వ్యహరిస్తున్నారన్నారు. ఇలానే పాలనా కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెపుతారన్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : కరణం బలరాం, ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ