కొవిడ్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తెలంగాణ సీఎం మాదిరిగా క్షేత్ర స్థాయిలో కొవిడ్ సమస్యలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కొవిడ్ నివారణ, నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ.. గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో కలిసి రెండు గంటలు దీక్ష చేపట్టారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను సైతం రాజకీయం చేయటం జగన్‌కే చెల్లిందన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం 35వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించిందని.. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలని కన్నా అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి...
ప్రజల ప్రాణాలతో ఇరురాష్ట్రాల సీఎంలు చెలగాటమాడుతున్నారు: అచ్చెన్నాయుడు