ETV Bharat / state

జగన్​ ఆదేశించినా పరిష్కారం కాని సమస్య.. మళ్లీ సీఎం కార్యాలయం వద్దకు ఆరుద్ర

author img

By

Published : Jan 24, 2023, 4:37 PM IST

Updated : Jan 24, 2023, 5:56 PM IST

ARUDRA INCIDENT : న్యాయం కోసం కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ ఒంటరి పోరాటం కొనసాగిస్తోంది. ఇద్దరు కానిస్టేబుళ్లు తనను వేధించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఇంటివద్దకు వచ్చి స్పందనలో మరోసారి ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయంలో ఫిర్యాదులు చేసినా.. క్షేత్ర స్థాయిలో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసినా .. నామమాత్రంగా చర్యలు తీసుకుని నిందితులను వదలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కేసులంటూ తనను, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న తన కూతురును ఇష్టానుసారంగా తిప్పుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సత్వర న్యాయం చేయాలంటూ ఆరోసారి సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి స్పందనలో వినతి పత్రం ఇచ్చారు.

ARUDRA INCIDENT
ARUDRA INCIDENT

ARUDRA INCIDENT : తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న కూతురు వైద్యం కోసం ఇళ్లు అమ్ముకుంటుంటే.. అడ్డుకుని తనను తీవ్రంగా వేధించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన కాకినాడకు చెందిన ఆరుద్ర సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. తనను వేధించిన వారిని శిక్షించాలని పోరాటం చేస్తుంటే.. తనపైనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ కాకినాడకు చెందిన మహిళ ఆరుద్ర మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

వెన్నెముక దెబ్బతిని తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూతురు లక్ష్మీసాయిచంద్రను తీసుకుని కాకినాడ నుంచి వందల కిలోమీటర్లు దాటుకుని సీఎం వద్దకు తన మొర చెప్పుకునేందుకు వచ్చారు. సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరగా పోలీసులు నిరాకరించారు. సీఎం నివాసం ఎదురుగా ఉన్న స్పందన కౌంటర్ వద్దకు వెళ్లేందుకు కూడా నిరాకరించారు. సీఎం క్యాంపు కార్యాలయం మెయిన్ చెక్​పోస్టు వద్దే ఆపేసిన పోలీసులు.. వినతి పత్రాన్ని తీసుకుని రసీదు ఇచ్చి పంపారు.

తనకు జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పుకుని స్పందనలో ఆరుద్ర విలపించారు. తన కూతురు చికిత్స కోసం తన ఇళ్లు అమ్మకుండా వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనను వేధించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పలుమార్లు స్పందనలో సీఎంను కోరినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్లపై తాను ఆధారాలతో సహా అమలాపురం పీఎస్​లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అమలాపురం స్థానిక ఎస్సై, సీఐ ఎఫ్ఆర్ నమోదు చేసి వదిలేశారని, పట్టించుకోవడం లేదని తెలిపారు. ఫిర్యాదుతో పాటు తానిచ్చిన ఆధారాలను ఎస్సై, సీఐ కోర్టుకు సమర్పించడం లేదని తెలిపారు. నిందితులు క్వాష్ పిటిషన్ వేయగా వాటికి ఆధారాలివ్వాలని తననే పదే పదే విజయవాడకు తిప్పుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్న తన కూతురును తీసుకుని కోర్టు చుట్టూ తిరిగేందుకు అష్టకష్టాలు పడుతున్నట్లు విలపించారు.

జగన్​ ఆదేశించినా పరిష్కారం కాని సమస్య.. మళ్లీ సీఎం కార్యాలయం వద్ద ఆరుద్ర ఆవేదన

"నన్ను సెకండ్​ అపోనెంట్​గా పెట్టారు. అలా తిరగలేననే సీఎంని వేడుకుంటే ఆయన సుమోటోగా తీసుకోవాలని ఆదేశించారు. మళ్లీ నాకు లాయర్​ని ఇచ్చి తిరగాలంటే .. ఐదుసార్లు కాకినాడ నుంచి ఇక్కడికి ఎలాగండి. మా పాపను తీసుకుని వెళ్లాలంటే చాలా కష్టం. ఒక్కరోజు మా పాప ఎక్కడ ఉండలేదు. ఎవరితో ఉండలేదు. ఎదిగిన పాపని తీసుకుని మేము ఎక్కడికని తిరగాలి. నేను మాములుగా ఉంటే ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. నా పాట్లు ఏవో నేను పడేదాన్ని. అలా చేయలేకనే సీఎం సాయం కోరాం. ఇక తిరగడం మా వల్ల కాదు"-ఆరుద్ర, బాధితురాలు

తన కూతురుకు చికిత్స కోసం తను ఉంటున్న ఇంటిని అమ్మకానికి పెడితే ఇంటికి వెళ్లే రహదారిపై గోడకట్టి, గేటు వేసి తాళం వేసి అమ్ముకోకుండా వేధించారన్న మహిళ.. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి తనకు న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుళ్ల వేధింపుల వల్లే ఇళ్లు అమ్మ లేక తన కూతురుకు సకాలంలో చికిత్స అందించలేకపోయానని తెలిపారు.

చికిత్స ఆలస్యం కావడం వల్ల తన కూతురు వెన్నముక తీవ్రంగా దెబ్బతిందని.. ఇప్పుడు చికిత్స చేసినా తన కూతురు బతకదని వైద్యులంటున్నారని బోరున విలపించారు. మంత్రి దాడిశెట్టి రాజా వెనకుండి నిందితులైన ఇద్దరు కానిస్టేబుళ్లను రక్షిస్తున్నారని ఆరుద్ర ఆక్షేపించారు. తనను తీవ్రంగా వేధించిన కానిస్టేబుళ్లు మెరపల కన్నయ్య, మెరపల శివపై చర్యలకు సీఎం ఆదేశాలివ్వాలని కోరారు. హామీ ఇచ్చినట్లు సుమోటో కేసు సత్వరం విచారించి నిందితులను నిందితులను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని సీఎం ను కోరారు.

"డాక్టర్లు ఒక్కటే చెప్పారు. ఇన్​టైంలో తీసుకురాలేదు. ఇన్​టైంలో తీసుకొచ్చుంటే మీ పాపకు బాగయ్యేది. ఇప్పుడేం చేయలేము. ఆపరేషన్​ అయితే చేయాలి.. కానీ బతికే ఛాన్సులు లేవని.. బ్రెయిన్​ డెడ్​ అవ్వచ్చు అంటున్నారు. నేను సీఎం కు ఒక్కటే విన్నవించుకుంటున్నాను. నాకు, నా కూతురుకి ఈ దుస్థితి తీసుకొచ్చిన వారిని శిక్షించాలి" -ఆరుద్ర, బాధితురాలు

న్యాయం కోసం ఇప్పటికే 5 సార్లు తాను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేసినట్లు బాధిత మహిళ ఆరుద్ర తెలిపారు. ఆరోసారి వచ్చి మరోసారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తను.. సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోగా... తన గోడును అధికారులకు చెప్పుకునేందుకు కనీసం సీఎం ఇంటి ఎదురుగా ఉన్న స్పందన కౌంటర్ వద్దకైనా పంపించాలని వేడుకున్నా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 24, 2023, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.