- కందుకూరు బాధిత కుటుంబాలకు చంద్రబాబు భరోసా.. ఇంటి పెద్దగా ఉంటానని హామీ
CBN CONSOLED KANDUKURI VICTIMS FAMILIES : నెల్లూరు జిల్లా కందుకూరు బహిరంగ సభ తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓదార్చారు. పార్టీ తరఫున ప్రకటించిన పరిహారం చెక్కులు అందజేశారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
- జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ సక్సెస్
EMERGENCY LANDING TRAIL RUN SUCCESS : బాపట్ల జిల్లా కొరిశపాడు సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రన్‌వేపై.. విమానాల అత్యవసర ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైంది. భారత వాయుసేనకు చెందిన నాలుగు విమానాలు రన్‌వే మీదుగా ప్రయాణించి.. కాస్త ఎత్తు నుంచే టేకాఫ్ అయ్యాయి. రన్‌వే విమానాల అత్యవసర ల్యాండింగ్‌కు పూర్తి అనువుగా ఉందని.. వాయుసేన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- కందుకూరులో జరిగిన ఘటన దురదృష్టకరం: పవన్
JANASENA PAWAN ON KANDUKURU INCIDENT : చంద్రబాబులో బహిరంగ సభలో జరిగిన ఘటనపై జనసేన అధినేత పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో 8 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు.
- కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. రైతులపై జమ్మలమడుగు ఎమ్యెల్యే అనుచరుల దాడి
Attack at Kadapa Collectorate : వైఎస్సార్ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే అనుచరులు, రైతులు పరస్పరం దాడి దిగారు. కలెక్టరేట్ దగ్గరే ఘటన జరగటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని శాంతింపజేశారు.
- కరోనా కట్టడికి కేంద్రం కొత్త రూల్.. వారందరికీ RTPCR రిపోర్ట్ తప్పనిసరి
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొక నింబంధన విధించింది. వివిధ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు ఆర్టీపీసీఆర్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని తెలిపింది. జనవరి 1 నుంచి నిబంధన అమలులోకి వస్తుందన్న కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
- నటి హత్య కేసులో ట్విస్ట్.. భర్త అరెస్ట్.. దొంగల పని కాదట!
దుండగుల కాల్పుల్లో మరణించిన యూట్యూబర్ రియా కుమారి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. హత్య వెనుక ఆమె భర్త హస్తం ఉందని గుర్తించిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- చైనాలో కొవిడ్ కేసులపై అనుమానాలు.. మరోసారి ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా?
China Covid Outbreak : చైనా కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్ ఇవే మాటలు చెప్పిందని దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి.
- కచేరీలో నోట్ల వర్షం.. కళాకారులపై 50 లక్షల రూపాయలు
గుజరాత్లో జరిగిన సంగీత కచేరీలో కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఈ కచేరీకి హాజరైనవారు కళాకారులపై అభిమానంతో పూలు జల్లినట్లు కరెన్సీ నోట్లు జల్లారు. నవసారి జిల్లా సూప గ్రామంలో స్వామి వివేకానంద ఐ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ సంగీత కచేరీ జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన దాదాపు రూ.50 లక్షలను కంటి సమస్యలు ఉన్నవారి చికిత్స కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
- సూర్యకుమార్, స్మృతి మందాన.. ఆ ఐసీసీ అవార్డుకు నామినేట్
సూర్యకుమార్ యాదవ్, స్మృతి మందాన టీ20ల్లో క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇంకా ఎవరెవరంటే?
ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం కూడా టీ20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లకు పురస్కారాన్ని అందించే దిశగా పురుషుల 'టీ20 క్రికెట్ ఆప్ ది ఇయర్-2022' అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ.
- బాలయ్యపై బాలీవుడ్ యాక్టర్ ప్రశంసలు.. అలా చూసి ఆశ్చర్యపోయారట!
నందమూరి నటసింహం బాలకృష్ణపై ఓ బాలీవుడ్ యాక్టర్ ప్రశంసలు కురిపించారు. బాలయ్యను అలా చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పారు.