ETV Bharat / state

కరోనా కష్టకాలంలో రాజకీయాలు వద్దు: తెదేపా - ap news latest updates

పౌరుల హక్కులకు భంగం కలిగితే ప్రశ్నించే హక్కు తెదేపా అధినేతకు లేదా అంటూ.. తెనాలి తెదేపా మాజీ అధ్యక్షులు ఖుద్దుస్ ప్రశ్నించారు. రాజద్రోహం చట్టం ఎప్పుడు అమలులో ఉందో ఒకసారి వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించుకోవాలని సూచించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో తప్ప ఇప్పటి వరకు అమలు కానీ 124ఎ చట్టం ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలన్నారు.

ysrcp
ysrcp
author img

By

Published : May 20, 2021, 8:49 AM IST

నరసాపురం ఎంపీగా గెలుపొందిన రఘురామకృష్ణంరాజు అరెస్టును ఖండించిన తెదేపా అధినేత చంద్రబాబుపై.. వైకాపా నేతల విమర్శలను తెదేపా నేత ఖుద్దూస్ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర దేశంలో చట్టాలకు అన్యాయం జరుగుతూ.. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం విధానాలను అనుసరిస్తుంటే దానిని ప్రశ్నిస్తున్న తెదేపా అధినేతపై విమర్శలు చేస్తారా.. అని మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు.

ఈ కేసుకు ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదని చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. సీఐడీ, సీబీసీఐడీ విభాగాలకు ప్రభుత్వంతో సంబంధం లేదా? అవి ప్రభుత్వ యంత్రాంగాలు కాదా? అని ప్రశ్నించారు. కరోనా రెండో దశ విలయతాండవం చేస్తుంటే వైకాపా నేతలు, ముఖ్యమంత్రి కక్షపూరిత వ్యవహారాలు చేయడం సరికాదని తెదేపా నేతలు మండిపడ్డారు. నమ్మకంతో ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకైనా ప్రభుత్వం.. కరోనా కష్ట కాలంలో వారికి అండగా నిలవాలని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 106 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.