ETV Bharat / state

AP CID Second Day Raids at Margadarsi Branches: ఆగని కక్షసాధింపు.. మార్గదర్శి బ్రాంచీల్లో రెండో రోజూ ఏపీ సీఐడీ తనిఖీలు - Margadarsi Branches

AP CID Second Day Raids at Margadarsi Branches: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచీల్లో వరుసగా రెండో రోజూ సీఐడీ తనిఖీలు నిర్వహిస్తోంది. సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని బ్రాంచీల్లో అధికారులు షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు.

AP_CID_Second_Day_Raids
AP_CID_Second_Day_Raids
author img

By

Published : Aug 18, 2023, 2:12 PM IST

Updated : Aug 18, 2023, 5:26 PM IST

AP CID Second Day Raids at Margadarsi Branches: ఆగని కక్షసాధింపు.. మార్గదర్శి బ్రాంచీల్లో రెండో రోజూ ఏపీ సీఐడీ తనిఖీలు

AP CID Second Day Raids at Margadarsi Branches: కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా మార్గదర్శిపై మళ్లీ దాడులకు తెగబడిన జగన్‌ ప్రభుత్వం.. వరుసగా రెండోరోజూ అదే ధోరణితో వ్యవహరిస్తోంది. సంస్థ కార్యాలయాల్లో సీఐడీ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. కొన్ని బ్రాంచిల్లో షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు. కొన్నిచోట్ల చిట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టేందుకు వచ్చినవారిని వెనక్కి వెళ్లాలని ఆదేశిస్తున్నారు. మార్గదర్శి బ్రాంచిల్లో విధులకు వచ్చిన సిబ్బంది సెల్‌ఫోన్లు తీసుకుంటున్నారు.

AP CID Raids in Margadarsi Branches కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు.. మూసివేత లక్ష్యంగా చర్యలు..

Raids in Ongole Margadarsi Office: ప్రకాశం జిల్లా ఒంగోలు మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చిట్స్, రెవెన్యూ, సీఐడీ, రిజిస్టర్ శాఖలకు చెందిన 8మంది సిబ్బంది.. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరున్నర వరకు తనిఖీలు నిర్వహించారు. మార్గదర్శి మేనేజర్ కు ఫోన్ చేసి కార్యాలయానికి రావాలని పిలిచారు. దీంతో రాత్రి నలుగురు మార్కెటింగ్ సిబ్బంది కార్యాలయానికి వచ్చి అధికారులకు సహకరించారు. తలుపులు వేసుకొని అధికారులు నివేదికలు తయారు చేశారు. తిరిగి రాత్రి 12 గంటలకు మరోసారి సోదాలు చేపట్టిన అధికారులు.. శుక్రవారం ఉదయం 6న్నర గంటల వరకు కొనసాగించారు. మరలా ఈ ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మళ్లీ సోదాలు ప్రారంభించారు. మీడియా వారిని వెళ్లిపోమని సీఐడీ అధికారులు ఆదేశించారు.

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా

Raids in Kurnool Margadarsi Office: కర్నూలు మార్గదర్శి కార్యాలయంలో రెండో రోజు దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి ఒంటి గంట వరకు దాడులు చేశారు. ఇవాళ ఉదయం మూకుమ్మడిగా దాడులు ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి మార్గదర్శి కార్యాలయం బయట నోటీసులు అంటించి ఫోటోలు తీసుకుని వెంటనే చించేశారు. ఈ విషయాన్ని అధికారుల వద్ద మార్గదర్శి మేనేజర్ వెంకటేష్ ప్రస్తావించారు. దీనిపై చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున దాటవేశారు. సహకరించాలని మాట మార్చారు. ఈ దాడుల్లో సీఐడీ సీఐ డేగల ప్రభాకర్, చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున, డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. కార్యాలయంలోకి ఎవరినీ పోలీసులు రానీయలేదు..

మార్గదర్శిపై చిట్స్‌ రిజిస్ట్రార్‌ ఇచ్చిన బహిరంగ నోటీసుపై ఏపీ హైకోర్టు స్టే

Raids in Kadapa Margadarsi Office: కడప, ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయాల్లో సీఐడీ అధికారుల సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. జిల్లా చిట్ రిజిస్టర్ భారతితో పాటు సీఐడీ సీఐ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల బృందం.. కడప మార్గదర్శి కార్యాలయానికి ఉదయం 8 గంటలకే చేరుకొని.. తనిఖీలు మొదలుపెట్టింది. ఇద్దరు రెవెన్యూ సిబ్బంది వీరితో పాటు ఉన్నారు. ఇటీవల మార్గదర్శిలో గడువు ముగిసిన ఐదు చిట్ గ్రూపుల వివరాలను జిల్లా రిజిస్టర్ భారతి పరిశీలించారు. దాదాపు 200 నుంచి 250 మంది కస్టమర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లను దగ్గర పెట్టుకొని.. వారితో మాట్లాడుతున్నారు. చీటీ పాడుకున్నప్పుడు షూరిటీలు సమర్పించడంలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా... అనే విషయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదని కస్టమర్లు సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ కస్టమర్లను తికమకపెట్టే ప్రశ్నలు అడుగుతూ వారిని కార్యాలయానికి పిలిపించే చర్యలు చేపట్టారు.

Margadarsi Case: 'మార్గదర్శి మూసివేతకు ఏపీ ప్రభుత్వ కుట్ర.. చట్టనిబంధనల ముసుగులో కక్షసాధింపు'

కడప, ఎర్రగుంట్లకు చెందిన ఇద్దరు కస్టమర్లను కడప మార్గదర్శి కార్యాలయానికి పిలిపించి వారితో వివరాలు సేకరించారు. కస్టమర్లకు ఫోన్లు చేసేటప్పుడు మార్గదర్శి మేనేజర్, సిబ్బంది మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఉండడంతో వారు అభ్యంతరం తెలియజేశారు. మీకు అవసరమైతే మీ ఫోన్లో మాట్లాడుకోవాలని మార్గదర్శి ఉద్యోగులు చెప్పినప్పటికీ.. సీఐడీ అధికారులు వినకుండా ఒత్తిడి చేసి కస్టమర్లతో ఫోన్లో మాట్లాడిస్తున్నారు. ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయంలో కూడా ఇదేవిధంగా క్లోజ్ చేసిన గ్రూపులకు సంబంధించి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

Raids in Srikakulam Margadarsi Office: శ్రీకాకుళం మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయంలో.. సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు.. రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్ తవిటయ్యతో పాటు ఇతర సిబ్బంది నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపిక చేసిన చందదారులకు.. రిజిస్ట్రేషన్, సీఐడీ అధికారులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారిని మార్గదర్శి కార్యాలయానికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు.

Margadarsi: మార్గదర్శిపై మరో పెద్ద కుట్ర.. ష్యూరిటీలు సమర్పించని చందాదారు ఫిర్యాదు ఆధారంగా పోలీసుల కేసు..

Raids in Guntur Margadarsi Office: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో 5 మార్గదర్శి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు చిట్ రిజిస్ట్రార్, రెవెన్యూ, ఇంటిలిజెన్స్, మున్సిపల్, కార్మికశాఖలకు సంబంధించిన అధికారులు వీరిలో ఉన్నారు. గుంటూరులోని అరండల్ పేట, మార్కెట్ సెంటర్, నరసరావుపేట, చీరాల, తెనాలి మార్గదర్శి శాఖల్లో ఉదయం 10గంటల తర్వాత నుంచి తనిఖీలు మొదలయ్యాయి. అన్నిచోట్లా పోలీసులను కాపలాగా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. మొదటి రోజున కొన్నిచోట్ల మార్గదర్శి కార్యాలయాల తలుపులు వేసి తనిఖీలు చేసిన అధికారులు.. రెండో రోజు మాత్రం షట్టర్లు తెరిచే ఉంచారు. మార్గదర్శి సిబ్బంది ఫోన్ల వినియోగంపై కొన్నిచోట్ల ఆంక్షలు విధించారు. ఒక్కో చోట 8నుంచి 12మంది వరకూ అధికారులతో కూడిన బృందాలు సోదాలు చేస్తున్నాయి.

Margadarsi Case: మార్గదర్శి కేసుల్లో కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన.. పలువురు అధికారులకు నోటీసులు

Raids in Chittoor Margadarsi Office: చిత్తూరు, తిరుపతి మార్గదర్శి కార్యాలయాల్లో రెండో రోజు సీఐడీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు సాగుతున్నాయి. కార్యాలయం లోపలికి వస్తున్న చందాదారులు, ఇతరుల వివరాలను.. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసులు సేకరించాకే అనుమతిస్తున్నారు. కార్యాలయ సిబ్బంది నుంచి సెల్‍ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిట్‍ డబ్బులు చెల్లించేందుకు కార్యాలయాలకు వస్తున్న కస్టమర్లను.. సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

Raids in Tanuku Margadarsi Office: తణుకు మార్గదర్శి శాఖలో విజిలెన్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. భీమవరంలో 50 లక్షల చిట్ లకు సంబంధించి...ఖాతాదారుల వివరాలు తెలుసుకుని సంబంధిత ఏజెంట్లను కార్యాలయానికి పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఏలూరు మార్గదర్శి బ్రాంచిలో మొత్తం నాలుగు శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పాడుకున్న మూడు చిట్ గ్రూపులకు చెందిన సభ్యుల వివరాలు తీసుకుని....వారికి ఫోన్లు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు.

Raids in Vizianagaram Margadarsi Office: విజయనగరం మార్గదర్శి బ్రాంచిలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మార్గదర్శి కార్యాలయంలోనే రాత్రి బస చేసిన సీఐడీ డీఎస్పీ భూపాల్.. ఉదయం పదిన్నర గంటల నుంచి సోదాల్లో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ, జీఎస్టీ అధికారులు కార్యాలయానికి వచ్చి.. చిట్ మొత్తాలు, ఖాతాదారులకు చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. చెల్లింపులో సందేహం ఉన్న వాటికి సంబంధించి ఫోన్‌ చేసి ఖాతాదారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ 12గంటలకు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. సీఐడీ డీఎస్పీ భూపాల్.... తన సహాయకులతో సోదాలు కొనసాగిస్తున్నారు.

Last Updated : Aug 18, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.