ETV Bharat / state

స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం.. సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్‌ భాస్కర్‌ అరెస్ట్​

SKILL DEVELOPMENT SCAM UPDTAES : నైపుణ్యాభివృద్ధి సంస్థలో అవకతవకల కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా ఈ కుంభకోణంలో సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్​ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీ కోర్టు ఆయనకు 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌ విధించింది. దీంతో విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చనున్నారు.

SKILL DEVELOPMENT SCAM UPDTAES
SKILL DEVELOPMENT SCAM UPDTAES
author img

By

Published : Mar 9, 2023, 12:32 PM IST

SKILL DEVELOPMENT SCAM UPDTAES : స్కిల్ డెవలప్​మెంట్​లో అవతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే తాజగా ఈ కేసులో ఒకరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీమెన్స్ కంపెనీ ప్రతినిధి జీవీఎస్ భాస్కర్​ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో తన నివాసంలో భాస్కర్‌ను అరెస్టు చేసిన పోలీసులు దిల్లీ హైకోర్టులో హాజరుపరిచారు. దిల్లీ కోర్టు ఆయనకు 36 గంటల ట్రాన్సిట్ రిమాండ్‌ విధించింది. దీంతో విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చనున్నారు. సీమెన్స్ కంపెనీ వద్ద 58 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ఇన్ వాయిస్​ను సీఐడీ అధికారులు గుర్తించారు.

ఆ స్కిల్ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్ విలువను 3,300కోట్లకు పెంచుతూ భాస్కర్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఏపీకి చెందిన కొంతమంది ప్రమేయంతో ప్రాజెక్టు విలువను భాస్కర్ పెంచారని సీఐడీ భావిస్తోంది. భాస్కర్ చెప్పటంతోనే ఏపీ ప్రభుత్వం 371 కోట్ల రూపాయలు చెల్లించిందని అధికారులు చెబుతున్నారు. కొందరు అధికారులతో భాస్కర్ కుమ్మక్కైయ్యారని తెలిపారు. అతని భార్య అపర్ణను స్కిల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​లో డిప్యూటీ సీఈవోగా నియమించారు. పక్కా పథకంతో స్కాం చేసినట్టు సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని సీఐడీ అరెస్టు చేసింది.

ప్రాజెక్ట్ అంచనాలు తారుమారు చేశారని సీఐడీ ఆరోపణలు: ఇతర నిందితులతో కలిసి సీమెన్స్.. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను 3300 కోట్ల రూపాయలకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని జీవీఎస్​ భాస్కర్​పై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో ఏపీ ప్రభుత్వంపై ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా 371 కోట్ల రూపాయల భారం ఏర్పడింది. కానీ సీమెన్స్ ఇండస్ట్రీయల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం 58 కోట్ల రూపాయలు అని బిల్లుల్లో నమోదైంది. అయితే జీవీఎస్​ భాస్కర్.. ప్రాజెక్ట్ అంచనాలను తారుమారు చేసి 3300 కోట్ల రూపాయలకు చేర్చాడని ఆంధ్రప్రదేశ్​ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.

అసలేం జరిగిందంటే: ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ పలు కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌, సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్​కు గత ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సొమ్మును అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌ వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. 2017-2018 సంవత్సరంలో 371 కోట్ల రూపాయలలో.. దాదాపు 241 కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగినట్లు సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.