గుంటూరు జిల్లా మాచవరం మండలానికి చెన్నాయపాలెం గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త వట్టే సైదారెడ్డిపై ఓ పార్టీకి చెందిన నాయకులు దాడికి పాల్పడ్డారు. అరుగు మీద కూర్చొని ఉన్న సైదారెడ్డిపై మారణాయుధాలతో ఓ పార్టీకి చెందిన నేతలు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం సైదారెడ్డి గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మాచవరం పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి