ETV Bharat / state

'ఆర్థిక' సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్​.. అప్పులు, కేంద్ర నిధులపైనే ఆధారం.. - ap depends on central government funds

ANDHRA PRADESH BUDGET: ఆంధ్రప్రదేశ్​ ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. రుణాలు, వడ్డీ చెల్లింపులకే కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మద్యం ఆదాయం, కేంద్ర నిధులే ఖజానాకు పెద్ద దిక్కుగా కనిపిస్తున్నాయి. మూలధన కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను త్వరలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇది 10వ బడ్జెట్‌. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. అత్యంత నిరుత్సాహకరమైన పరిస్థితి కనిపిస్తోందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ విశ్రాంత ఆచార్యులు ఎన్‌. శ్రీదేవి విశ్లేషించారు.

ANDHRA PRADESH BUDGET
ANDHRA PRADESH BUDGET
author img

By

Published : Mar 13, 2023, 9:22 AM IST

'ఆర్థిక' సుడిగుండంలో ఆంధ్రప్రదేశ్​.. అప్పులు, కేంద్ర ప్రభుత్వ నిధులపై అధికంగా ఆధారం

ANDHRA PRADESH BUDGET : ఆదాయ వ్యయాల లెక్కలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్​ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయినట్లు స్పష్టమవుతోంది. సొంత ఆదాయాలు క్షీణించిపోవటంతో కేంద్ర ప్రభుత్వ నిధులు, అప్పులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మూలధన కేటాయింపులు నామమాత్రంగా మారిపోవటం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. అప్పుల భారం పెరగడం, అప్పులు- దానిపై వడ్డీ కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. రుణాల్లోనూ బడ్జెట్లో కనిపించని అప్పుల వాటా గణనీయంగా పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రానికి రాబడినిచ్చే మూలధన వసూళ్లు, రెవెన్యూ క్రమంగా పడిపోతున్నాయి. జీఎస్‌డీపీలో వాటాగా చూస్తే రాష్ట్రానికి సొంత ఆదాయం క్షీణించటం 2017-18లో మొదలైంది. 2018-19, 2019-2020 ఆర్థిక సంవత్సరాలను మినహాయిస్తే.. మిగిలిన సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయాల్లో సగం మాత్రమే సొంతం. మిగిలింది కేంద్రం నుంచి వచ్చిన సొమ్మే. కేంద్ర పన్నుల్లో కేంద్రం నుంచి గ్రాంట్‌- ఇన్‌- ఎయిడ్‌ రూపంలో లభించే నిధులు, రాష్ట్ర వాటాపై ఆంధ్రప్రదేశ్‌ అధికంగా ఆధారపడుతోందనే విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

2014-15 నుంచి మొదటి నాలుగు సంవత్సరాలలో రవాణా శాఖ ఆదాయం అన్నింటి కంటే అధిక వృద్ధిని కనబరచింది. రిజిస్ట్రేషన్లు, వాహనాలపై పన్ను, లైసెన్సుల జారీ ఆదాయం బాగా సమకూరింది. ఆ తర్వాత ఎక్సైజ్‌ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు రాష్ట్రానికి ఎక్సైజ్‌ నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన వనరుగా స్థిరపడింది. అయినా రాష్ట్రానికి రాబడి సరిపోక ఇష్టానుసారం అప్పులు చేస్తోంది. అందులో ప్రధానంగా మార్కెట్‌ రుణాలపై అధికంగా ఆధారపడుతుండటంతో అధిక వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తోంది. అప్పులు తిరిగి చెల్లించటం కూడా పెనుభారం కాబోతోంది. గత కొన్ని సంవత్సరాలలో మూలధన వసూళ్లలో బహిరంగ మార్కెట్‌ రుణాల వాటా గణనీయంగా పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఈ పరిస్థితే.

బడ్జెట్‌లో చూపించాల్సిన అవసరం లేకుండా ఇతర మార్గాల్లో ప్రభుత్వాలు చేసే అప్పులను ఆఫ్‌- బడ్జెట్‌ బారోయింగ్స్‌ అంటారు. సాధారణంగా ప్రభుత్వ కార్పొరేషన్లు, సంస్థల పేరు మీద ఇలా అప్పులు తీసుకొని ఆ సొమ్మును ప్రభుత్వాలు ఖర్చులకు వాడుకుంటూ ఉంటాయి. ఇలాంటి రుణాల్లో పారదర్శకత ఉండదు. శాసన వ్యవస్థ అనుమతి, పర్యవేక్షణ ఉండవు. ప్రభుత్వానికి నేరుగా బాధ్యత ఉన్నట్లు కనిపించదు. ఇలా బడ్జెట్‌లో చూపించని అప్పులను ఏపీ ప్రభుత్వం ఎడాపెడా చేస్తోంది.

అంతిమంగా ఈ అప్పులు, దానిపై వచ్చే వడ్డీ భారం.. అన్నీ రాష్ట్ర ప్రభుత్వం పైనే పడతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2016 మార్చి 31 నాటికి ఆఫ్‌- బడ్జెట్‌ బారోయింగ్స్‌ 7 వేల162 కోట్ల రూపాయలు మాత్రమే. 2021 మార్చి 31 నాటికి ఇవి 86 వేల 260 కోట్ల రూపాయలకు.. అంటే ఆరు సంవత్సరాలలోనే 12 రెట్లు పెరిగిపోయాయి. వీటిని బడ్జెట్లో కనిపించే రుణాలకు కలిపితే రాష్ట్రంపై అప్పుల భారం ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం నాటికి 91 వేల330 కోట్ల రూపాయల మేరకు గ్యారంటీలు ఇచ్చింది. ఇవి 2015-16లో 7 వేల59 కోట్ల రూపాయలు మాత్రమే.

ఏపీజీఎస్‌డీపీలో మూలధన వ్యయ శాతం అనూహ్యంగా క్షీణించింది. మూలధన కేటాయింపులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి అంటే.. స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధి సాధనకు ఎంత మాత్రం అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు, కేటాయింపుల్లో 70 నుంచి 82 శాతం రెవెన్యూ వ్యయమే కావటం ఆందోళనకరమైన పరిణామం. దీని వల్ల మూలధన వ్యయం తగ్గిపోయింది. అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల, ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్రానికి సొంత ఆదాయం అధికంగా సమకూరుతుంది.

ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దీర్ఘకాలంలో రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ సంవత్సరంలో చేసిన మూలధన కేటాయింపుల ప్రభావం రెండు, మూడేళ్లలో కనిపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో.. సంక్షేమ కార్యక్రమాలను అమలు తప్పనిసరైనప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను విస్మరించటం తగని పని. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తేనే ఏ సమాజమైనా తన కాళ్లపై తాను నిలబడగలుగుతుందనేది వాస్తవం. ఏ ప్రభుత్వమైనా ఈ అంశాన్ని విస్మరించకూడదు. ఏపీ విషయంలో ప్రస్తుతం అలాంటి దార్శనికతే లోపించింది.

సొంత ఆదాయం తగ్గిపోయి.. అప్పులు, కేంద్ర పన్నుల్లో గ్రాంట్లపై అధికంగా ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌పై లోటు భారం దిగివచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. 2021-22లో మినహాయిస్తే.. అంతకు ముందు సంవత్సరాల్లో ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు ఎంతో అధికంగా నమోదవటం సమస్య తీవ్రతకు అద్దం పడుతుంది.

రెవెన్యూ లోటు నుంచి రెవెన్యూ మిగులు స్థితికి రాష్ట్రం రావడమనేది ఇప్పట్లో అయ్యే పనిలా కనిపించటం లేదు. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు అధికంగా ఉండటం ఒక ఇబ్బంది అయితే.. రుణాల తిరిగి చెల్లింపు, వడ్డీలు మోయలేని భారంగా మారబోతున్నాయి. రాష్ట్రానికి లభించే ఆదాయంలో వడ్డీ చెల్లింపులకు 2015-16లో 11 శాతం కేటాయించగా 2020-21లో 17 శాతం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

14, 15వ ఆర్థిక సంఘాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు.. ద్రవ్య లోటును రాష్ట్రం తగ్గించుకోలేకపోయింది. 2017-18, 2018-2019 ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య లోటు తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత పరిస్థితి క్షీణించింది. జీఎస్​డీపీలో ఆదాయం తగ్గి అప్పుల వాటా పెరిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.