ETV Bharat / state

Suryanarayana Bail Petition: సూర్యనారాయణ బెయిల్​ పిటిషన్​.. తొందరపాటు చర్యలు వద్దు: హైకోర్టు - andhra news

KR SuryaNarayana Bail Petition: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జులై 7వ తేదీలోపు పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ వ్యాజ్యంపై కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 28, 2023, 3:33 PM IST

AP Government Employees Association leader KR Suryanarayana: ఉద్యోగ సంఘం నేత కె.ఆర్‌.సూర్యనారాయణ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు పిటిషనర్‌కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జులై 7వ తేదీలోపు పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు వెలువరించేవరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ముందస్తు బెయిల్‌ వ్యాజ్యంపై కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.

విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై 12వ అదనపు జిల్లా కోర్టు/6వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు(ఎంఎస్‌జే) విచారణాధికార పరిధి తమకు లేదంటూనే కేసు లోతుల్లోకి వెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పరిధి లేదనుకున్నప్పుడు కేసులోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిలు నిరాకరిస్తూ 12వ ఏడీజే/6వ అదనపు ఎంఎస్‌జే కోర్టు జూన్‌ 15న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తామని, అనిశా ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తామని తెలిపింది. అనిశా కోర్టు తాజాగా విచారణ జరిపి బెయిలు పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించేంత వరకు సూర్యనారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరిస్తామని పేర్కొంది. ఈ సూచనలు ఇరుపక్షాలకు అంగీకారం అయితే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిసింది. పిటిషనర్‌ సూర్యనారాయణ తరఫు సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ ఆమోదం తెలిపారు. పోలీసుల తరఫు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ) ఈ సూచనలపై వైఖరి తెలిపేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో నేడు కేసు విచారణ సందర్భందా జులై 7వ తేదీ లోపు పిటిషన్‌పై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించింది.

అసలేం జరిగిందంటే: వాణిజ్య పన్నులశాఖ ఆదాయానికి గండీ కొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులతోపాటు అయిదో నిందితుడిగా కేఆర్‌ సూర్యనారాయణపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అనిశా నిరోధక చట్టం కింద సెక్షన్‌ చేర్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సూర్యనారాయణ విజయవాడ ఆరో అదనపు ఎంఎస్‌జే కోర్టును ఆశ్రయించారు. ఉపశమనం లభించకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. సంబంధం లేని వ్యవహారంలో పిటిషనర్‌ను ఇరికించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెండు విచారణలు చేయించిందని అందులో పిటిషనర్‌ పాత్ర వెల్లడి కాలేదన్నారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి హోదాలో.. గవర్నర్‌ను కలిసి వినతి ఇచ్చాక ప్రభుత్వం వేధించడం ప్రారంభించిందన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.