2020ని మహిళా భద్రత దినోత్సవంగా ప్రకటిస్తున్నామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. దిశ చట్టం గురించి మహిళలకు వివరించారు. మహిళల కోసమే ప్రత్యేకంగా దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహిళా పీఎస్‌లో పనిచేసే సిబ్బంది గతంలో దాన్ని శిక్షగా భావించేవారని.. ఇప్పుడు దిశ పీఎస్‌లో పని చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. దిశ పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం అదనపు భత్యం ఇస్తామని డీజీపీ స్పష్టం చేశారు. దిశ కేసుల కోసం జిల్లాకొకటి చొప్పున ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పీఎస్‌ను మహిళలతో స్నేహపూర్వకంగా ఉండేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. దిశ చట్టంపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనం చేస్తోందని వివరించారు.
ఇవీ చదవండి.. పోలీసుస్టేషన్ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్