కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకం కింద 2015లో రాష్ట్రంలో 5 నగరాలు, 26 పురపాలక సంఘాలు ఎంపికయ్యాయి. అందులో గుంటూరు జిల్లా చిలకలూరుపేట పురపాలక సంఘం కూడా ఉంది. చిలకలూరిపేటలో 24 గంటల నిరంతర తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో 2017లో పనులు ప్రారంభించారు. చిలకలూరిపేట పురపాలక సంఘంలో లక్షా 30 వేల జనాభా, 27 వేల కుటుంబాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులో భాగంగా నకరికల్లు అడ్డరోడ్డు నుంచి సాగర్ కాల్వ ద్వారా చిలకలూరిపేటలోని తాగునీటి చెరువుల అనుసంధానానికి 40.85 కిలోమీటర్ల మేర పైపు లైను వేయాలనేది లక్ష్యం. ఇప్పటివరకు 11 కిలోమీటర్లు పైపులైను మాత్రమే పూర్తయింది.
మందగమనంతో సాగుతున్న పనులు..
ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో 3 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. శ్రీనివాసనగర్, తూర్పు మాలపల్లి వద్ద నిర్మాణం పూర్తయ్యాయి. టిడ్కో గృహ సముదాయం వద్ద మూడో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణంలో ఆగిపోయింది. పట్టణంలో అంతర్గత పైపులైను నిర్మాణం మొదటి దశలో 15 కిలోమీటర్ల పూర్తి కాగా.. రెండో దశలో 45 కిలోమీటర్లకుగాను.. 10 కిలోమీటర్లు మేర పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం పనులు మందగమనంతో సాగుతున్నాయి.
తాగునీటి పథకం నిర్మాణానికి ఎదురవుతున్న నిధుల కొరతపై.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చిలకలూరిపేట ప్రజలు కోరుతున్నారు. పురపాలక సంఘానికి ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే ఈ మొత్తాన్ని భరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: