ETV Bharat / state

AMARAVATI: రాజధాని దీక్షా శిబిరాల్లో కిట్టయ్యల సందడి..'జై అమరావతి నినాదాలు' - amaravathi movement updates

ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ.. రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలు 622వ రోజుకు చేరాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకొని రాజధాని దీక్షా శిబిరాల్లో కన్నయ్యలు సందడి చేశారు.

amaravathi movement reached to 622 day
amaravathi movement reached to 622 day
author img

By

Published : Aug 30, 2021, 6:00 PM IST

మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి ప్రాంతంలో రైతులు, మహిళలు 622వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, నెక్కల్లు, దొండపాడు, కృష్ణాయపాలెంలో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని రాజధాని దీక్షా శిబిరాల్లో కిట్టయ్యలు సందడి చేశారు. వెలగపూడి, మోతడక, తుళ్లూరులో చిన్నారులకు కన్నయ్య వేషాలు వేసి దీక్షలో కూర్చొబెట్టారు. రైతులతో కలసి రాధాకృష్ణులు 'జై అమరావతి' అంటూ నినదించారు. అనంతరం దీక్షా శిబిరంలోనే చిన్నారులతో ఉట్టి కొట్టించారు.

అమరావతి ఉద్యమం

బొత్సపై చర్యలకు..

కృష్ణాయపాలెంలో రైతులు వర్షంలోనే నిరసన తెలిపారు. న్యాయదేవతకు పూలాభిషేకం చేశారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ ఐకాస నేతలు తుళ్లూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

RRR: 'సీఎం పర్యటనకు వెళ్లినప్పుడల్లా.. బొత్స అలాగే మట్లాడతారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.