తమ గోడును పట్టించుకోని జగన్... సీఎం పదవికి రాజీనామా చేయాలని రాజధాని ప్రాంత మహిళలు డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షలు 50వ రోజుకు చేరాయి. మందడం, వెంకటపాలెం గ్రామాలకు చెందిన మహిళలు... భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. అమరావతిపై కేంద్రం వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరిని తప్పుపట్టారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... కొంతమంది కుటుంబసభ్యులను మీడియా ముందుకు తెచ్చి... అసలు సమస్యే లేనట్లుగా ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:ఆగని రాజధాని రైతుల ఆందోళనలు