పరిపాలన వికేంద్రీకరణను నిరసిస్తూ అమరావతి రైతులు 308వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, వెంకటపాలెం, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఐనవోలు, అనంతవరం, నీరుకొండ, ఎర్రబాలెం గ్రామాల్లో దీక్షా శిబిరాల వద్ద ఆందోళన నిర్వహించారు.
దొండపాడు, అబ్బరాజుపాలెం దీక్షా శిబిరాలలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రతిమను అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలని జగజ్జననిని వేడుకున్నారు. మందడం దీక్షా శిబిరంలో ఉన్న అమ్మవారిని డబ్బులతో అలంకరించారు.
ఇవీ చదవండి:
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు