ETV Bharat / state

ఎమ్మెల్యే శ్రీదేవిపై అమరావతి మహిళల ఆగ్రహం.. నల్ల జెండాలతో నిరసన

రాజధాని ఉద్యమంపై ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలను అమరావతి మహిళలు ఖండించారు. తుళ్లూరులో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి నల్లజెండాలు ఊపి నిరసన తెలియజేశారు.

amaravathi farmers fires on mla sridevi comments on amaravathi
ఎమ్మెల్యే శ్రీదేవిపై అమరావతి మహిళల ఆగ్రహం
author img

By

Published : Aug 28, 2020, 3:42 PM IST

Updated : Aug 28, 2020, 4:08 PM IST

ఎమ్మెల్యే శ్రీదేవిపై అమరావతి మహిళల ఆగ్రహం

అమరావతిలో జరుగుతున్న పోరాటాన్ని ఫోటో ఉద్యమమన్న తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలపై రాజధాని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటో ఉద్యమమా లేక నిజమైన పోరాటమా వచ్చి చూడాలని మహిళలు సవాల్ విసిరారు. తుళ్లూరులో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీదేవికి రైతులు నల్లజెండాలు ఊపి నిరసన తెలియజేశారు. మహిళలను రోడ్డుపైకి రాకుండా పోలీసులు అడ్డుగా నిలిచారు. శ్రీదేవి తీరును నిరసిస్తూ అంబేడ్కర్ చిత్రపటానికి, న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు.

రాజధాని ఉద్యమంపై శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను మహిళలు ఖండించారు. సాంకేతిక కారణాలు చూపి అసైన్డ్​ రైతులకు కౌలు చెల్లించలేదని దళిత ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లంక భూముల్లో జరిగిన అవకతవకలపై సిట్ విచారణ చేస్తోందన్న సాకుతో కౌలు చెల్లించడం లేదని రైతులు అన్నారు.

ఇదీ చదవండి: మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

Last Updated : Aug 28, 2020, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.