మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తూ.. అమరావతిలో రైతులు 382వ రోజు రైతులు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు సహా మరికొన్ని చోట్ల రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఐనవోలులో రైతుల మెడకు ఉరితాళ్లు బిగించుకొని నిరనస తెలిపారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్.. రైతులకు మద్దతు ప్రకటించి, నిరసనలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వైకాపా సర్కార్ ఒక్కొకటి తొలగిస్తుందని రైతులు ఆరోపించారు.
ఇదీ చదవండి: