ETV Bharat / state

అక్రమ బయో ఉత్పత్తుల స్థావరంపై అధికారుల దాడులు - agri and police officers raids on illegal bio products manufacturing unit at prattipadu

అక్రమంగా బయో ఉత్పత్తులను తయారు చేస్తున్న స్థావరంపై.. వ్యవసాయ, పోలీసు అధికారులు దాడులు జరిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో.. రమేష్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడ్డాడని భావిస్తున్నారు. అక్కడ వివిధ రకాల ఉత్పత్తులతో పాటు ఖాళీ డబ్బాలు, పలు లేబుల్స్, స్టాంపు ముద్రలు ఉన్నట్లు తెలిపారు.

bio products illegal manufacturing
అక్రమ బయో ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడులు
author img

By

Published : Dec 20, 2020, 7:30 AM IST

అక్రమ బయో ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం వద్ద అక్రమంగా బయో ఉత్పత్తులు తయారు చేస్తున్న స్థావరంపై.. వ్యవసాయ, పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 20 రకాల ఉత్పత్తులతో పాటు ఖాళీ డబ్బాలు, వివిధ రకాల పేర్లతో ఉన్న లేబుల్స్, స్టాంపు ముద్రలను అధికారులు పరిశీలించారు. రూ. 4 లక్షల విలువైన సామగ్రి తయారు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.

గడువు ముగిసిన పురుగు మందు డబ్బాలపై.. పాత లేబుల్స్ తొలగించి కొత్తవి అతికిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. తయారు చేసిన బయో ఉత్పత్తులను దుర్గి, విజయవాడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని అంచనాకు వచ్చారు. నిందితుడు రమేష్ నుంచి ఇతర వివరాలను సేకరిస్తున్నారు.

బయో మందులు వాడొద్దు...

బయో మందులను రైతులు వినియోగించవద్దని.. వ్యవసాయ శాఖ డీడీ రామాంజనేయులు సూచిస్తున్నారు. కొంతమంది అక్రమ మార్గంలో త్వరగా డబ్బు సంపాదించేందుకు వాటిని తయారు చేస్తున్నారని చెప్పారు. ఈ తరహా ఉత్పత్తుల్లో పురుగు మందు అవశేషాలు ఉన్నాయేమో పరీక్షలు చేయాల్సి ఉందన్నారు.

ఇదీ చదవండి:

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై అపోహలు వీడండి: వైకాపా ఎంపీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.