రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బుద్ధుడి విగ్రహం ఎదుట రైతులు ఆందోళన చేశారు. వైకాపా అధికారంలోకి రాగానే రైతులను, ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం కోసం తమ భూములు ఇస్తే...ఇవాళ వైకాపా మంత్రులు అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుపానులకు కేంద్రం అమరావతా.?..లేక విశాఖపట్నమా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అమరావతిలో.. 19వ రోజూ ఉద్ధృతంగా ఆందోళనలు