కోర్టులు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టులను హైకోర్టు వ్యవస్థీకృత నేరంగా పరిగణించిందని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై గతంలో 49 మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిన హైకోర్టు... ఇవాళ మరో 44మందిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. ప్రణాళికతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, కొందరు మీడియా ప్రతినిధులు కోర్టులను విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే హైకోర్టు వ్యవస్థీకృత నేరంగా అభిప్రాయపడిందన్నారు.
కోర్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్, శాసన సభాపతి తమ్మినేని, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం ఇటీవల చేసిన వ్యాఖ్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియోలు కోర్టుకు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: