సరైన జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే కరోనాను జయించగలం కాబట్టి అనుమానితులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సినీనటుడు జయ ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ కారణంగా గుంటూరులో ఉంటున్న ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు వేర్వేరు కారణాలతో జయటకు చెప్పడానికి జంకుతున్నారని... దీనివల్ల వారితో పాటు వారి కుటుంబానికి, సమాజానికి ప్రమాదమని హెచ్చరించారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడొద్దని, అవేమి జైళ్లు కావని స్పష్టం చేశారు. అందరూ సహకరిస్తే త్వరలో జనజీవనం సాధారణ స్థితిలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి :