గుంటూరు జిల్లాలో ప్రేమ పేరుతో యువతిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి.. యువతిని మోసగించి రూ. 25 లక్షలు దోచుకున్నాడు. స్మార్ట్ సర్వీస్ పేరుతో వ్యాపారం పెట్టించి లక్షల్లో రుణం తీసుకుని పరారయ్యాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు రూ.8 వేల నగదు, వోక్స్ వ్యాగన్ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజా వెల్లడించారు.
ఏం జరిగిందంటే..?
గుంటూరు కి చెందిన ఓ యువతీ లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్నామని టిండర్ యాప్‌ని ఇంస్టాల్ చేసుకుని.... లొకేషన్ కి దగ్గరలో ఉన్న వారితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో గుంటూరు హెచ్.బి కాలనీకి చెందిన చిల్లంకూరి విజయభాస్కర్ రెడ్డి పరిచయం అయ్యాడు. కొద్దిరోజులు చాటింగ్ చేసుకున్నారు. తాను బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి హైదరాబాద్ లో సిగ్నెట్ టెక్నాలజీ లో పనిచేస్తున్నాని చెప్పగా.... భాదితురాలు విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తునట్లు చెప్పింది.
ఇద్దరు అభిరుచులు పనులు ఒకటే కావడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. హైదరాబాద్ వెళ్లిన తరువాత మరల ఇద్దరు కలుసుకుని కొన్నాళ్లు తిరిగారు. ఇద్దరు కలసి బిజినెస్ చేద్దామని... లాక్ డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతినిందని.. బిజినెస్ చేస్తే కోట్లు వస్తాయని నిందితుడు నమ్మించాడు. స్మార్ట్ సర్వీస్ అని వ్యాపారం పెట్టించి రిజిస్ట్రేషన్ ఖర్చు 2 లక్షలు బాధితురాలు చేత కట్టించాడు.
ఆ తరువాత విడతల వారిగా బిజినెస్ కోసం లక్షలలో వివిధ బ్యాంకుల్లో లోను తీసుకున్నారు. కొద్దిరోజులు తరువాత భాదితురాలు లోనులో వోక్స్వ్యాగన్ కారు కోనుగోలు చేసింది. విజయభాస్కర్ రెడ్డి తరచు బిజినెస్ పేరుతో లక్షల తీసుకోవడంతో భాదితురాలుకి అనుమానం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు కలసి గుంటూరులోని ఓ హోటల్ కి వచ్చి భోజనం చేశారు. భోజనం తరువాత భాదితురాలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్లగా... నిందితుడు కారు తీసుకుని పరాయ్యాడు. వెంటనే భాదితురాలు అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 8 వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.