మాచర్లలోని 24 వ వార్డు కు చెందిన షేక్ దరియాబీ మూత్రపిండాల సమస్యతో బాధ పడుతోంది. ఆమె డయాలసిస్ కోసం వారానికొకసారి గుంటూరు వెళ్లి రావాల్సి వస్తోంది. దీనికి తోడు బీపీ, మధుమేహం ఉండటంతో ఇంకా ఆరోగ్యం క్షిణిస్తోంది. అసలే పనులు లేక ఆర్థిక ఇబ్బందులు.. దీనికితోడు కరోనా కారణంగా గుంటూరు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉండటం లేదు.. ప్రయివేట్ వాహనాల్లో వెళ్లాలంటే వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. భర్త మస్తాన్ వలి అనారోగ్యంతో ఎటూ కదలలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో అటు ఆర్థిక ఇబ్బందులు.. ఇటు అనారోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేయటంతో మానసికంగా కుంగిపోయిన దరియాబీ బాత్రూమ్ లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు...అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య - గుంటూరు జిల్లాలో వివాహిత ఆత్మహత్య వార్తలు
గుంటూరు జిల్లా మాచర్లలో అనారోగ్య సమస్యలు ఆ కుటుంబాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీశాయి. చాలీ చాలని కూలీ పనులతో జీవితాన్ని నెట్టుకొచ్చే ఆ కుటుంబంలోని దంపతులకు అనారోగ్య సమస్యలు..ఆర్థిక ఇబ్బందులు కుంగదీశాయి. మానసిక వేదన తాళలేక మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదాన్ని నింపింది.
మాచర్లలోని 24 వ వార్డు కు చెందిన షేక్ దరియాబీ మూత్రపిండాల సమస్యతో బాధ పడుతోంది. ఆమె డయాలసిస్ కోసం వారానికొకసారి గుంటూరు వెళ్లి రావాల్సి వస్తోంది. దీనికి తోడు బీపీ, మధుమేహం ఉండటంతో ఇంకా ఆరోగ్యం క్షిణిస్తోంది. అసలే పనులు లేక ఆర్థిక ఇబ్బందులు.. దీనికితోడు కరోనా కారణంగా గుంటూరు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉండటం లేదు.. ప్రయివేట్ వాహనాల్లో వెళ్లాలంటే వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. భర్త మస్తాన్ వలి అనారోగ్యంతో ఎటూ కదలలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో అటు ఆర్థిక ఇబ్బందులు.. ఇటు అనారోగ్య సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేయటంతో మానసికంగా కుంగిపోయిన దరియాబీ బాత్రూమ్ లోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి-'నా భర్త ఆచూకీ తెలపండి'.. కరోనా బాధితుని భార్య ఆవేదన..!