farmer bought Japan shoes: పొలంలో పాముకాట్ల నుంచి తప్పించుకునేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు ప్రత్యేకమైన బూట్లు వినియోగిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన బాల శశికాంత్ యూట్యూబ్‌లో వీడియో చూసి ఆర్డర్ చేశారు. జపాన్ బూట్లుగా పిలిచే వీటిని తాను హైదరాబాద్ నుంచి తెప్పించినట్లు ఆయన తెలిపారు. మోకాళ్ల వరకూ ఉండే బూట్లు.. పూర్తిగా కాళ్లు మొత్తాన్ని కప్పేలా తయారు చేశారు. రాత్రిసమయంలో పాములు, తేళ్లు కరిచినా ఏమీ కాదని, అంతేకాకుండా.. మందులు పిచికారీ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెబుతున్నారు సదరు రైతు.
ఇదీ చదవండి :