గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధురాలు.. కరోనాతో మృతి చెందినట్లు పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కావూరు గ్రామానికి వచ్చిన వారి నుంచి.. వృద్ధురాలికి కరోనా సోకింది. ఆమెను జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వృద్ధురాలు నివసించే పరిసర ప్రాంతాల వారికి కరోనా పరీక్షలు చేశారు. ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధరణైంది.
వృద్ధురాలు నివసించే ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికీ.. వైద్యులు, సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఒకరిని కేఎంసీ వైద్యశాలకు తరలించారు. మరో ఆరుగురిని హోమ్ క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: