ETV Bharat / state

కరోనా రౌండప్​: జిల్లాలో కొత్తగా 621 పాజిటివ్ కేసులు

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు గుంటూరు జిల్లా యంత్రాంగానికి సవాల్​గా మారాయి. సోమవారం నాడు వచ్చిన కేసులతో జిల్లాలో పాజిటివ్ రోగుల సంఖ్య 24వేలకు చేరువలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించి వైరస్ అనుమానితుల్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కరోనా పరీక్షలు వేగవంతం చేయటం ద్వారా కరోనాని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

corona positive cases
corona positive cases
author img

By

Published : Aug 10, 2020, 10:14 PM IST

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 621 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 23 వేల 958కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో సత్తెనపల్లి మున్సిపాలిటిలో అత్యధికంగా 153, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 122 ఉన్నాయి. ఇక జిల్లాలోని తెనాలిలో 46, మాచర్ల 33, అమరావతి 29, నాదెండ్ల 28, కారెంపూడి 21, పిడుగురాళ్ల 21, బాపట్ల 16, గురజాల 16, క్రోసూరు 14, ముప్పాళ్ల 12, తాడేపల్లి 11, అచ్చంపేట 9, పెదకూరపాడులో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 80 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా కారణంగా సోమవారం నాడు 10మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 233కు చేరుకుంది.

కరోనా నుంచి జిల్లాలో 14వేల 592 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం కేసుల్లో గుంటూరు నగరంలోనే సగం ఉన్నాయి. దీంతో కేసుల కట్టడిపై ఉన్నతాధికారులతో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ సమీక్షించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను త్వరితగతంగా గుర్తించాలని ఆదేశించారు. వార్డు సచివాలయాల వారీగా ఉన్న సర్వేలెన్స్ బృందాలతో పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ ను గుర్తించాలన్నారు. ఈ ప్రక్రియలో సిబ్బంది చొరవ చూపటం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ... కరోనాతో మృతి చెందే వారిలో తీవ్ర అనారోగ్య లక్షణాలతో చివరి నిమిషంలో ఆసుపత్రులకు వస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ప్రతి సచివాలయం పరిధిలోని కుటుంబాలను సర్వే చేసి 40 ఏళ్లు దాటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని, 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిని గుర్తించాలన్నారు. వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గుంటూరులో కేసులు ఎక్కువగా ఉన్న నల్లచెరువు, శ్రీనివాసరావుతోట, ముత్యాలరెడ్డినగర్, వెలాంగినినగర్, ఎన్జీవో కాలనీ తదితర హాట్ స్పాట్ ప్రాంతాలలో ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఇదీ చదవండి

ఏపీ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటుంది: తెలంగాణ సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.