ETV Bharat / state

AP 10th Class Results 2023: పదవ తరగతిలో షాకింగ్​ ఫలితాలు.. 38 పాఠశాలల్లో ఒక్కరూ కూడా.. - 38 Schools Record 0 Pass Result in Class 10

38 Schools Got Zero Results In 10th Class: రాష్ట్రవ్యాప్తంగా 38 పాఠశాలల్లో పదో తరగతిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇందులో 16 ప్రభుత్వ, ఎయిడెట్ పాఠశాల్లో అందరూ ఫెయిల్‌ అయ్యారు. 22 ప్రైవేటు పాఠశాలల్లోనూ... అవే ఫలితాల వచ్చాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 7, 2023, 10:59 AM IST

38స్కూళ్లలో సున్నా ఫలితాలు

38 Schools Got Zero Results In 10th Class : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38 పాఠశాలల్లో సున్నా ఫలితాలు రాగా ఇందులో 9 ప్రభుత్వ, 7ఎయిడెడ్, 22ప్రైవేటు బడులు ఉన్నాయి. గతేడాది 71పాఠశాలల్లో సున్నా ఫలితాలు రాగా వాటిలో 40 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలే. అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలం గుంటసీమ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల నుంచి 18 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వీరిలో ఒక్కరూ పాసవ్వలేదు. పిల్లలు తరచూ గైర్హాజరైనా ఉపాధ్యాయులు పట్టించుకోక పోవడంతో సున్నా ఫలితాలు వచ్చాయి. ఆశ్రమ పాఠశాలల పర్యవేక్షణ సరిగా లేకపోవడం సైతం ఫలితాలపై ప్రభావం చూపింది. అన్ని సబ్జెక్టుల బోధనకు ఉపాధ్యాయులున్నా పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడం విశేషం.

ఎయిడెడ్‌లో ఉపాధ్యాయ నియామకాల భారం దించుకునేందుకు ప్రభుత్వం అమలుచేసిన విధానాలు సున్నా ఫలితాలకు దారితీశాయి. ఎయిడెడ్‌ బడులను ప్రభుత్వంలో విలీనం చేయడం, లేదంటే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎయిడెడ్‌లో కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. కానీ, ఉపాధ్యాయులను నియమించట్లేదు. ఆ స్కూళ్లే ప్రైవేటు టీచర్లను నియమించుకోవాల్సి వస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు ఎయిడెడ్‌ పాఠశాలల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని సీఎం ఎయిడెడ్‌ పాఠశాలలో రెగ్యులర్‌ ఉపాధ్యాయులు ఒక్కరూ లేరు. ఈ పాఠశాల నుంచి పదోతరగతి పరీక్షలకు అయిదుగురు హాజరుకాగా అందరూ ఫెయిల్‌ అయ్యారు. ప్రభుత్వం ఎయిడెడ్‌లో నియామకాలు చేపట్టకపోవడమే ఇందుకు దారితీసింది.

సున్నా ఫలితాలు వచ్చిన ప్రభుత్వ బడుల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినా ఇప్పటికీ ఎక్కువే. 2018లో సున్నా ఫలితాల బడులు 5 ఉండగా 2019లో ఒక్కటీ లేదు. గత సంవత్సరం ఒక్కసారిగా ఇది 22కు చేరింది. ఈసారి తొమ్మిదికి తగ్గింది. ఎయిడెడ్‌ బడుల్లో రెగ్యులర్‌ టీచర్లు లేకపోవడం, పిల్లలు భారీగా తగ్గిపోవడం వల్ల యాజమాన్యం దృష్టిపెట్టక సున్నా ఫలితాలు వస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నతీకరించినా ఉపాధ్యాయులను సకాలంలో నియమించలేదు. ఈ విద్యా సంవత్సరంలో చాలా పాఠశాలలు పూర్తిస్థాయి ప్రధానోపాధ్యాయులు లేకుండానే కొనసాగాయి.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదిలో సున్నా ఫలితాలు వచ్చాయి. ఈ పాఠశాల నుంచి 14 మంది పరీక్షలు రాశారు. ప్రాథమికోన్నత పాఠశాలను రెండేళ్ల క్రితం ఉన్నత పాఠశాలగా చేశారు. రెగ్యులర్‌ హెచ్‌ఎం లేకపోవటం, తరగతి గదులు సరిపడా లేక వల్లే సున్నా ఫలితాలు వచ్చాయంటున్నారు. వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం గోవిందాయిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో 15మంది పరీక్షలు రాయగా.. ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. గణితంలో 11, సైన్స్‌లో 8మంది ఫెయిలయ్యారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజుపల్లె జడ్పీ హైస్కూల్లో 11 మంది పరీక్ష రాస్తే ఒక్కరూ పాస్‌ కాలేదు. 6నుంచి పదో తరగతి వరకు 64 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఎనిమిది మంది ఉపాధ్యాయులే ఉన్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.