గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. కొత్తగా గుంటూరు నగరంలోనే 10 కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో 8, తాడేపల్లిలో 5, తెనాలిలో 2, బాపట్ల మండలం కంకటపాలెంలో 2, తక్కెళ్లపాడు, గుల్లాపల్లి, కర్లపాలెంలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు అధికారులు వివరించారు.
గుంటూరు నగరంలోని రెడ్డిపాలెంలో ముంబయి నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్న వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. మంగళగిరిలో నమోదైన కేసుల్లో ఇద్దరు డీజీపీ కార్యాలయ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాజా కేసులతో కలిపి తాడేపల్లిలో 75, మంగళగిరిలో 45, తెనాలిలో 23కు పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. జిల్లాలో ఇప్పటివరకూ 493మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు