ETV Bharat / state

దిల్లీ వెళ్ల లేదు.. విదేశీ ప్రయాణం చేయలేదు - గుంటూరులో కరోనా కేసులు న్యూస్

గుంటూరు జిల్లాలో నమోదైన కరోనా కేసులన్నీ దిల్లీ మూలాలు ఉన్నవే. ఒక కేసు విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా సోకగా, మిగిలినవన్నీ దిల్లీ వెళ్లి వచ్చిన వారి ద్వారానే. అయితే పల్నాడులో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం అంతుచిక్కడం లేదు. ఇదే మాదిరి పొన్నూరులో మరొకరికి కరోనా ఎలా వచ్చిందనేది తేలలేదు. మృతులు గాని, వారింట్లో వారు గాని ఎవరూ దిల్లీ యాత్ర చేయలేదు. వీరి ఇళ్లల్లో విదేశాల నుంచి వచ్చినవారు ఎవరూ లేరు.

3 corona cases mystery in gunturu
3 corona cases mystery in gunturu
author img

By

Published : Apr 12, 2020, 11:12 AM IST

గుంటూరు జిల్లాలో నమోదైన మూడు కరోనా కేసులు అధికార యంత్రాంగాన్నే కాదు.. జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి.. వారికి కరోనా ఎలా సోకిందనే దానిపై స్పష్టత లేక.. అధికారులు తంటాలు పడుతున్నారు. వీరుండే ప్రాంతంలో కరోనా ఎవరికి ఉండవచ్ఛు. ఇంకా ఎంతమందికి వైరస్‌ వ్యాప్తి అయి ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో కరోనా కేసులు శనివారం ఒక్క రోజే 17 నమోదయ్యాయి. వీటిల్లో 16 కేసులు గుంటూరు నగరంలోవి కాగా, ఒకటి మాత్రమే దాచేపల్లికి చెందినదిగా గుర్తించారు. వీటితో కలిపి ఇప్పటివరకు 75 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధికంగా కరోనా కేసులు ఉన్న జిల్లాగా గుంటూరు రెండో స్థానంలో ఉంది. దిల్లీ, విదేశీ పర్యటనలు చేయనివారికి సైతం జిల్లాలో కరోనా వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ తరహా కేసులు దాచేపల్లి, నరసరావుపేట, పొన్నూరులో మూడు నమోదు కావడంతో వీరికి ఎలా సంక్రమించింది అనే కోణంలో పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. చనిపోయిన నరసరావుపేట వాసి స్థానిక కేబుల్‌ ఆపరేటరు వద్ద బిల్లు కలెక్షన్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. పట్టణంలోని వరవకట్ట ప్రాంతంలో ఉంటూ స్థానికంగా ఇంటింటికి తిరుగుతూ బిల్లులు వసూలు చేస్తుంటాడు. ఆ ప్రాంతంలో ఎవరి ద్వారా ఇతనికి వ్యాపించింది.. ఇంకా ఎవరికైనా వ్యాప్తించిందా.. అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన మరొకరు కరోనాతో మృతి చెందినట్లు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు శనివారం వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి స్థానికంగా ఎలక్ట్రీషీయన్‌గా పని చేసేవాడు.. స్థానికంగా ఇప్పటి వరకు కరోనా లక్షణాలతో ఉన్నవారు ఎవరూ లేరు. కరోనాతో వ్యక్తి చనిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ కరోనా ఉన్నవారు ఎవరున్నారనే దానిపై ఇంటింటా సర్వే చేస్తున్నారు. పొన్నూరులోని ఓ వ్యక్తికి దిల్లీ నేపథ్యం లేకున్నా కరోనా సోకడంతో వైద్యాధికారులు ఇంటింటా సర్వే చేస్తున్నారు.

తొలి కరోనా బాధితుడి డిశ్చార్జి:

జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ బాధితుడిని ఆసుపత్రి నుంచి శనివారం సాయంత్రం డిశ్చార్జి చేశారు. పూర్తిగా కోలుకుని ఇంటికి రావడంతో బాధితుడి కుటుంబీకుల్లోనే కాదు.. యంత్రాంగంలో హర్షం వ్యక్తమైంది.

తొమ్మిది మంది నుంచి 53 మందికి..

ఇప్పటి వరకు పోలీసుల విచారణలో దిల్లీ వెళ్లొచ్చిన 9 మంది ద్వారా 53 మందికి వ్యాప్తి చెందినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. వారితో కలిసి తిరగడం, సమీప ఇళ్లకు చెందినవారు వారి ఇళ్లకు వచ్చి కూర్చోవడం, మాట్లాడటం వంటివి చేయడం ద్వారా ఇలా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు యంత్రాంగం తెలిపింది. జిల్లాలో అత్యధికంగా గుంటూరు నగరంలోనే కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 56 కేసులు వచ్చాయి. నగరంలో సంక్రమించిన వారందరికీ మూలాలు దిల్లీయేనని యంత్రాంగం పేర్కొంది. ఒక్క కేసు మాత్రమే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా వ్యాప్తి చెందింది.

శనివారం వ్యాధి నిర్ధారణ అయిన 17 మందిలో ఒకే కుటుంబానికి చెందిన వారు 10 మంది బాధితులుగా ఉన్నారు. 6, 7, 8 ఏళ్ల చిన్నారులకు కరోనా వ్యాప్తి చెందింది. శనివారం నగరంలో నమోదైన కేసులన్నీ ఆనందపేట, కుమ్మరిబజార్‌, సంగడిగుంట ప్రాంతాల్లోనే వచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో లాక్‌డౌన్‌ వేళలను కుదించటం, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పటిష్ఠమైన బారికేడ్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇతరులను బయటకు రాకుండా కట్టడి చేయడం, హోమ్‌ డెలివరీ వ్యవస్థలను తీసుకొచ్చారు. కఠిన ఆంక్షలు అమలు చేసినా నగరంలో కరోనా కేసులు నిత్యకృత్యంగా వెలుగుచూడటంపై యంత్రాంగం సైతం బెంబేలెత్తుతోంది.

ఇదీ చదవండి: 24 గంటల్లో 909 కొత్త కేసులు- 34 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.