గుంటూరు ప్రభుత్వ మహిళ కళాశాల వసతి గృహంలో ఆహారం వికటించి 20 విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో ఉంటున్న ఇంటర్, డిగ్రీ విద్యార్ధులు మధ్యాహ్నం కోడికూరను తిన్నారు. భోజనం చేసిన వారు ఒక్కసారిగా కడుపు నొప్పి , తలనొప్పి, కళ్ళు తిరగడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వంటకు బ్లీచింగ్ అధిక గాఢత ఉన్న నీటిని వాడటం వల్ల, కూరలో శనగపిండి కలపడం వల్ల ఆహారం వికటించిందని విద్యార్ధులు తెలిపారు. విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. తమ ఆరోగ్యంపై వార్డెన్, ఇతర అధికార్లు ఎవరు వాకబు చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇదీచూడండి.అదృశ్య హస్తం... పార్కుల్లో విధ్వంసం...