అద్దంకి - నార్కట్ పల్లి హైవేపై లారీ ఢీకొని 15 గొర్రెలు మృతిచెందగా మరో రెండింటికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని సంతగుడిపాడు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి కొండ అనే వ్యక్తి తనకు చెందిన 59 గొర్రెలను సంతగుడిపాడు వద్దనున్న కిట్టమ్మకుంట వద్ద హైవేపై.. రోడ్డు దాటిస్తుండగా ప్రమాదం జరిగింది.
హైదరాబాదు వైపు వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి... అదే సమయంలో రోడ్డు దాటుతున్న గొర్రెలను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో.. గొర్రెల మృతి కారణంగా సుమారు రూ. 2 లక్షలు నష్టం వాటిల్లినట్లు యజమాని తమ్మిశెట్టి కొండ ఆవేదన చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై పి.హజరత్తయ్య.. లారీడ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: