గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పరిస్థితి టెన్షన్..టెన్షన్‌గా ఉంది. రేపు తెదేపా, వైకాపా పోటాపోటీగా 'ఛలో ఆత్మకూరు' నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం ప్రశాంతంగా జరుపుకుంటున్నారన్న డీజీపీ... శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు కాపాడటంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇదీ చదవండీ... ప్రభుత్వం జీతం ఇస్తున్న కార్యకర్తలే గ్రామవాలంటీర్లు - కన్నా