ETV Bharat / state

POLAVARAM: పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం.. మీ ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు సాధ్యం కాదు - పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం వార్తలు

పోలవరంపై ఎత్తిపోతల నిర్మాణం సరికాదని..టన్నెళ్ల సామర్థ్యం పెంపు, వెడల్పు కుదరదని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది. మీ ఇష్టమొచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టడం సాధ్యంకాదన్న కేంద్రం...డీపీఆర్‌ సిద్ధం చేసి పంపితే పరిశీలిస్తామని తేల్చిచెప్పింది.

POLAVARAM
POLAVARAM
author img

By

Published : May 20, 2022, 4:43 AM IST

పోలవరం జలాశయంపై చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గోదావరి వరద జలాల సమర్థ వినియోగానికి ప్రారంభించిన పోలవరం కుడి కాలువ టన్నెళ్ల సామర్థ్యం పెంచే పనులనూ చేపట్టడానికి వీల్లేదంది. దిల్లీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఈ రెండు అంశాలూ చర్చకొచ్చాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఈ పనులపై గతంలోనే అభ్యంతరం తెలిపింది. కేంద్ర జల్‌శక్తిశాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలనీ సూచించింది.

పోలవరం జలాశయంలోని డెడ్‌ స్టోరేజీ నీటిని వాడుకునేందుకు ఎత్తిపోతలు నిర్మిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాల అవసరాల కోసం ఈ పథకం చేపట్టినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున జనవరి నుంచి ఏప్రిల్‌ల మధ్యలో అవసరమైనప్పుడు ఎత్తిపోసి వినియోగించుకుంటారు. ఈ మేరకు ఎత్తిపోతల పనులకు రూ.914 కోట్లతో పాలనామోదం ఇచ్చి టెండర్లు పిలిచారు. రూ.765.94 కోట్లకు మేఘా సంస్థ పనులు దక్కించుకుంది. వెంటనే ప్రాథమిక పనులను చేపట్టారు.

మరోవైపు ప్రాజెక్టులో కుడి కాలువ టన్నెళ్ల సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి వరద జలాలను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఈ ఆలోచన చేశారు. ప్రస్తుతం టన్నెళ్లను వెడల్పు చేస్తున్నారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం నుంచి లేఖ అందింది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ చర్చ జరిగింది.

ఇవీ కేంద్రం అభ్యంతరాలు...

* ఎత్తిపోతల ద్వారా డెడ్‌ స్టోరేజీ నీటిని ఎలా వినియోగించుకుంటారు? ఆ నీటిని వాడుకుంటే ప్రాజెక్టు మళ్లీ నిండేందుకు సమయం పడుతుంది. ఈలోపు పోలవరం కింద నిర్దేశించిన ఇతర అవసరాలకు నీటిని ఇవ్వడం సాధ్యం కాదు.

* గోదావరి డెల్టాలో రబీ అవసరాలకు సాగునీటి ఇబ్బంది తలెత్తుతుంది.

* పోలవరం ప్రాజెక్టు టన్నెళ్ల సామర్థ్యం ఎలా పెంచుతారు?

* మీ అంతట మీరే ఈ పనులు ఎలా చేపడతారు?

ఇదీ రాష్ట్రం వాదన...

* పోలవరం ప్రాజెక్టు గోదావరి నదిపై దిగువ ప్రాంతంలో ఉంది.

* ఎగువన నీటిని వినియోగించుకున్న తర్వాతే వరద జలాలు దిగువకు వస్తాయి. అంటే ఇతర రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావమూ పడదు.

* ప్రతి ఏటా 2 వేల టీఎంసీల నుంచి 3 వేల టీఎంసీల వరకు వరద జలాలు సముద్రం పాలవుతున్నాయి.

* మాకు వచ్చిన నీటిని మేం వినియోగించుకునేందుకు మాత్రమే ఈ పథకాలను చేపడుతున్నాం.

సమగ్ర వివరాలను పంపించండి

* గోదావరిపై ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు, ఏపీ కొత్తగా కడుతున్న ఎత్తిపోతల పథకాలు, ఇప్పటికే ఉన్న పథకాల నీటి అవసరాలను చెప్పాలి.

* వీటికిందున్న ఆయకట్టు, నీటి అవసరాలు తెలపాలి. ఎంత నీటిని వినియోగించుకుంటున్నారో పేర్కొనాలి.

* మీరు ఏం పనులు చేపట్టినా డీపీఆర్‌లు రూపొందించి కేంద్ర జలసంఘానికి పంపాలి. వారు అధ్యయనం చేసిన తర్వాత అనుమతులు ఇస్తారు.

జలాశయం పనుల నాణ్యతపైనా చర్చ : దిల్లీలో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనుల నాణ్యతపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. పనులను పరిశీలిస్తూ... నాణ్యత పెంచేందుకు ఇద్దరు అధికారులను ప్రాజెక్టు వద్దే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. వారు క్షేత్రస్థాయిలోనే ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ పనుల నాణ్యత పెంచేందుకు చర్యలు తీసుకుంటారు.

* కేంద్ర జలసంఘం డైరక్టర్‌ స్థాయి అధికారిని కూడా పోలవరం ప్రాజెక్టు క్షేత్రం వద్ద నియమించాలనే ప్రతిపాదన చర్చకు వచ్చింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి: Polavaram: పోలవరం తొలిదశ అంచనాలు కేంద్ర కేబినెట్‌కు.. దిల్లీ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.