ETV Bharat / state

'నాపై అకారణంగా కేసులు పెడుతున్నారు'.. ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్​ - ఏలూరు కోర్టులో చింతమనేని ప్రైవేటు పిటిషన్​

TDP leader Chintamaneni prabhakar petition in Eluru court: అధికార వైకాపా నేతలు తనపై అకారణంగా కేసులు పెడుతున్నారని, రాజకీయంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. ఈ విషయమై సీఎం జగన్, సజ్జల, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, పలువురు అధికారులపై ఏలూరు కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు.

TDP leader Chintamaneni prabhakar
ఏలూరు కోర్టులో చింతమనేని ప్రైవేటు పిటిషన్​
author img

By

Published : May 26, 2022, 4:17 PM IST

'నాపై అకారణంగా కేసులు పెడుతున్నారు'.. ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్​

TDP leader Chintamaneni prabhakar News: రాజకీయంగా కక్ష సాధించేందుకు తనపై అకారణంగా కేసులు పెడుతున్నారని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వాపోయారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్, సజ్జల, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నలుగురు ఐపీఎస్ అధికారులు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు.

గతేడాది ఆగస్టులో విశాఖ గ్రామీణ జిల్లాలో పోలీసులు ఎన్​కౌంటర్ చేయడానికి సైతం ప్రయత్నం చేశారని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న ప్రతిసారి.. తన మీద కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. గడచిన రెండేళ్లలో తనపై 25కు పైగా పోలీసు కేసులు పెట్టారని చింతమనేని వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.